Share News

ICICI Bank Withdraws: కనీస నిల్వపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:14 AM

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ రూ.50 వేలు ఉండాలన్న నిబంధనపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌ తీసుకుంది..

ICICI Bank Withdraws: కనీస నిల్వపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌

  • రూ.50 వేలు ఉండాలన్న నిబంధనపై వెనక్కి

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ రూ.50 వేలు ఉండాలన్న నిబంధనపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌ తీసుకుంది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కనీస నిల్వ మొత్తాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్బన్‌ ప్రాంతాల్లో కనీస నిల్వ రూ.15 వేలు, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ.7,500 ఉంటే చాలని తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ గతంలో మాదిరిగా 2,500 ఉంటే చాలని స్పష్టం చేసింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే అపరాధ రుసుం విధించే నిబంధనను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలోనే తొలగించాయి. కనీస నిల్వ రూ.50 వేలు ఉండాలంటూ ఈనెల 9న ఐసీఐసీఐ బ్యాంక్‌ చేసిన ప్రకటన కలకలం రేపడంతో పాటు విమర్శలకు తావిచ్చింది.

Updated Date - Aug 14 , 2025 | 10:30 AM