Share News

పాక్‌లో రేడియేషన్‌ లీక్‌ అవ్వలేదు: ఐఏఈఏ

ABN , Publish Date - May 16 , 2025 | 05:36 AM

పాకిస్థాన్‌లోని అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి అణుధార్మికత(రేడియేషన్‌) లీక్‌ అవ్వలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) స్పష్టం చేసింది.

పాక్‌లో రేడియేషన్‌ లీక్‌ అవ్వలేదు: ఐఏఈఏ

న్యూఢిల్లీ, మే 15: పాకిస్థాన్‌లోని అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి అణుధార్మికత(రేడియేషన్‌) లీక్‌ అవ్వలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) స్పష్టం చేసింది. భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా నిర్వహించిన దాడుల్లో పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌లో ఉన్న స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు వస్తున్న వార్తలను ఐఏఈఏ పరోక్షంగా ఖండించింది. తమకున్న సమాచారం మేరకు పాక్‌లోని న్యూక్లియర్‌ కేంద్రాల వద్ద ఎలాంటి లీకేజీ లేదని పేర్కొంది. అటు భారత వైమానిక అధికారి, ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి కూడా తాము కిరానా హిల్స్‌ను టార్గెట్‌గా చేసుకోలేదని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే..!

Updated Date - May 16 , 2025 | 05:36 AM