Bengaluru Acid Attack: ఫోన్ సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై యాసిడ్
ABN , Publish Date - May 25 , 2025 | 05:42 AM
బెంగళూరు చిక్కబాణవారలో భర్త, భార్య ఫోన్ సౌండ్ తగ్గించమని చెప్పడంతో అతడి కోపంతో బాత్‌రూమ్ క్లీన్ చేసే యాసిడ్ చల్లి దాడి చేశాడు. భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి వెతుకుతున్నారు.
బెంగళూరులో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ‘నిద్రపోవాలి.. ఫోన్ సౌండ్ తగ్గించు’ అని చెప్పిన భార్యపై బాత్‌రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌ను చల్లాడు భర్త. బెంగళూరు నగరంలోని చిక్కబాణవార ఎన్‌హెచ్‌ఎం లే అవుట్‌లో ఈ నెల 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యూటీషియన్‌గా పనిచేసే భార్యను ఆ రాత్రి 9 గంటలకు మద్యం కోసం భర్త డబ్బులు అడిగాడు. ఇవ్వనన్నా.. తీవ్రంగా వేధించి డబ్బులు తీసుకుని వెళ్లి మద్యం తాగి వచ్చాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వినడం ప్రారంభించాడు. తాను నిద్రపోవాలని, సౌండ్ తగ్గించాలని భార్య కోరడంతో ఆగ్రహించిన భర్త.. బాత్‌రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌ను తెచ్చి ఆమెపై చల్లి పరారయ్యాడు. గాయపడ్డ ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చిక్కబాణవార పోలీసులు శనివారం తెలిపారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..