Share News

BIG BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్

ABN , Publish Date - Aug 13 , 2025 | 07:27 AM

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దౌసా-మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

BIG BREAKING: ఘోర  ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్

జైపుర్‌, ఆగస్టు 13: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దౌసా-మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే.. రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్ ఆలయంలో ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం గురించి వివరాలను తెలియజేస్తూ దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. " తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు. 9 మందిని చికిత్స కోసం రిఫర్ చేశారు. మరో ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు... ప్యాసింజర్ పికప్ మరియు ట్రైలర్ ట్రక్ మధ్య ప్రమాదం జరిగింది. వారికి చికిత్స కొనసాగుతోంది." అని అన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 07:38 AM