Share News

అదనపు కట్నం ఇవ్వలేదని కోడలికి హెచ్‌ఐవీ సూది

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:30 AM

అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్తమామలు కోడలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెకు హైచ్‌ఐవీ వైరస్‌ అంటి ఉన్న ఇంజక్షన్‌ను ఇచ్చారు. ఈఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు

అదనపు కట్నం ఇవ్వలేదని కోడలికి హెచ్‌ఐవీ సూది

సహరన్‌పూర్‌, ఫిబ్రవరి 16: అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్తమామలు కోడలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెకు హైచ్‌ఐవీ వైరస్‌ అంటి ఉన్న ఇంజక్షన్‌ను ఇచ్చారు. ఈఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువతికి 2023 ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్‌తో వివాహమైంది. వివాహ సమయంలో యువతి తండ్రి వరుడికి కొంత నగదు, నగలతో పాటు ఓ కారు ఇచ్చారు. అత్తమామలు తమకు మరో రూ.25 లక్షల నగదు, మరింత పెద్ద కారు కావాలంటూ కోడలిని వేధించసాగారు. ఆమెను చంపేస్తే తమ కుమారుడికి మరో పెళ్లి చేయొచ్చనే దురాలోచనతో హెచ్‌ఐవీ వైరస్‌ అంటి ఉన్న ఇంజక్షన్‌ను ఎక్కించారు.

Updated Date - Feb 17 , 2025 | 05:30 AM