ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం
ABN , Publish Date - May 11 , 2025 | 03:52 AM
ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
న్యూఢిల్లీ, మే 10: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సైనిక చర్యను ఆపేందుకు భారత్, పాక్ ఓ అవగాహనకు వచ్చాయనే ప్రకటన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.