Share News

Ganga River Pollution: స్నానానికి పనికిరాని గంగ నీరు!

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:16 AM

నీటిలో అధిక స్థాయిలో బ్యాక్టీరియాలు (టోటల్‌ కోలిఫాం, ఫీకల్‌ కోలిఫాం) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు బిహార్‌ కాలుష్య నియంత్రణ మండలి(బీఎ్‌సపీసీబీ) రాష్ట్రంలోని 34 చోట్ల పక్షం రోజులకోసారి చేసిన గంగా నది నీటి నాణ్యత పరిశీలనలో వెల్లడైందని అధికారులు తెలిపారు.

Ganga River Pollution: స్నానానికి పనికిరాని గంగ నీరు!

బిహార్‌లో అనేక చోట్ల కలుషితం

రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి

పట్నా, మార్చి 2: కాలుష్యం కారణంగా బిహార్‌లోని అనేక చోట్ల గంగా నది నీరు స్నానానికి పనికి రాదని రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. నీటిలో అధిక స్థాయిలో బ్యాక్టీరియాలు (టోటల్‌ కోలిఫాం, ఫీకల్‌ కోలిఫాం) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు బిహార్‌ కాలుష్య నియంత్రణ మండలి(బీఎ్‌సపీసీబీ) రాష్ట్రంలోని 34 చోట్ల పక్షం రోజులకోసారి చేసిన గంగా నది నీటి నాణ్యత పరిశీలనలో వెల్లడైందని అధికారులు తెలిపారు. గంగా నది, దాని ఉపనదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చి కలిసే వ్యర్థ నీటి కారణంగా బ్యాక్టీరియా అధిక మొత్తంలో చేరిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో గంగా, దాని ఉపనదుల్లో పీహెచ్‌, డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌, బయో-కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) వంటి ఇతర పారామితులు పరిమితి స్థాయిలో ఉన్నాయని, ఈ నీరు జల జీవరాశులకు, చేపల పెంపకానికి, వ్యవసాయానికి సరిపోతుందని తెలిపింది. బీఎ్‌సపీసీబీ చైర్మన్‌ శుక్లా మాట్లాడుతూ..

gthj.jpg

మలంలో ఈ ఫీకల్‌ కోలిఫాం బ్యాక్టీరియా ఉంటుందని చెప్పారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కన్నా గంగా నదిలో చాలా చోట్ల ఫీకల్‌ కోలిఫాం పరిమితి మించిపోయిందని, దీంతో ఆ నీరు స్నానానికి పనికిరాదని పేర్కొన్నారు. నదిలోకి వచ్చే నీటి శుద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 03 , 2025 | 02:16 AM