Share News

Plane Crash: కుప్పకూలిన విమానం.. 230 మందికి పైగా ప్రయాణికులు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 02:10 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.

Plane Crash: కుప్పకూలిన విమానం.. 230 మందికి పైగా ప్రయాణికులు..

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది, ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తున్నారు.


కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్ గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టు సమాచారం. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.


ప్రమాద స్థలిలో పరిస్థితి ఇదీ..


Also Read:

దేశంలోనే తొలిసారి.. 9 అంతస్థుల భవనంలో మెట్రో రైలు పరుగులు

టీమిండియాకు రెండే ఆప్షన్లు.. గంభీర్ స్పీచ్ వింటే గూస్‌బంప్సే!

For More National News

Updated Date - Jun 12 , 2025 | 03:07 PM