GST on Business Class Tickets: బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల ధరలపై జీఎస్టీ పెంపు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:17 AM
కొత్తగా రెండు శ్లాబుల జీఎ్‌సటీ విధానాన్ని తీసుకురానున్న కేంద్రం.. విమానాల్లో ప్రీమియం, బిజినెస్ క్లాస్ టికెట్ల..
న్యూఢిల్లీ, ఆగస్టు 29: కొత్తగా రెండు శ్లాబుల జీఎ్‌సటీ విధానాన్ని తీసుకురానున్న కేంద్రం.. విమానాల్లో ప్రీమియం, బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలపై 18 శాతం పన్ను విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టికెట్ల ధరలపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే.. సంపన్న తరగతుల విమాన టికెట్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు, ఎకానమీ క్లాస్ సినిమా టికెట్ల ధరల మీద ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతాలతో కూడిన 4 శ్లాబులున్నాయి. వీటిని రెండింటికి కుదించి 5 శాతం, 18 శాతానికి పరిమితం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..