The Ministry of Defence: మాజీ సైనికోద్యోగుల పిల్లల వివాహానికి రూ.లక్ష
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:33 AM
దేశంలో పింఛనుకు అర్హులు కాని మాజీ సైనికోద్యోగులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రక్షణ శాఖ 100ు పెంచింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 15: దేశంలో పింఛనుకు అర్హులు కాని మాజీ సైనికోద్యోగులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రక్షణ శాఖ 100ు పెంచింది. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆమోదం తెలిపారు. కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా మాజీ సైనికోద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న మొత్తాలను రెట్టింపు చేసినట్టు రక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు కోసం నవంబరు 1 నుంచి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఏటా 32 లక్షల మంది ఆర్థిక సాయం పొందుతున్నారని, ప్రతి సంవత్సరం 60 వేల మంది కొత్తగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపింది.
ఫ పెన్షన్‌కు అర్హులు కానీ మాజీ సైనికోద్యోగులకు ప్రస్తుత ఇస్తున్న పెనరీ గ్రాంట్‌ను రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంచారు.
ఫ పెన్షన్‌కు అర్హులు కాని సైనికోద్యోగుల భార్యలకు(వితంతువులు) కూడా రూ.8 వేల చొప్పున ఇస్తారు. ఇది ఎలాంటి ఆదాయం లేని, 65 ఏళ్లు పైబడిన వారికి వర్తిస్తుంది.
ఫ సైనికోద్యోగుల కుటుంబాల్లో ఇద్దరు పిల్లల చదువులకు ప్రస్తుతం నెలవారీ ఇస్తున్న రూ.వెయ్యిని రూ.2 వేలకు పెంచారు. వితంతువులు పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు కూడా ఇస్తారు.
ఫ సైనికోద్యోగుల కుటుంబాల్లోని యువతుల వివాహానికి ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచారు. ఇది ఇద్దరు కుమార్తెల వరకు వర్తిస్తుంది.