Share News

Google CEO: ఉద్యోగార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:26 AM

ఐటీ, టెక్నాలజీ సంస్థలు నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఏఐ టూల్స్‌ వాడుతున్నారన్న అనుమానాల మధ్య గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌..

Google CEO: ఉద్యోగార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి

  • ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో ఏఐ దుర్వినియోగం : పిచాయ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఐటీ, టెక్నాలజీ సంస్థలు నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఏఐ టూల్స్‌ వాడుతున్నారన్న అనుమానాల మధ్య గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.. ఉద్యోగార్థులకు ఒక రౌండ్‌ వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరని తెలిపారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో ఏఐ దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడ్డారు. కాగా, పలు దిగ్గజ సంస్థలు, టెక్‌ నియామక ఏజెన్సీలు కూడా 50 శాతానికి పైగా ఉద్యోగార్థులు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో అనధికారిక టూల్స్‌ వాడుతున్నారని అనుమానిస్తున్నాయి. అప్లికేషన్ల ప్రక్రియలో ఏఐ టూల్స్‌ వాడకంపై ఆంథ్రోపిక్‌ నిషేధం విధించగా, సిస్కో, మెకెన్సీ, డెలాయిట్‌ ముఖాముఖీ ఇంటర్వ్యూలతో నియామక ప్రక్రియ చేపట్టాయి.

Updated Date - Aug 26 , 2025 | 01:26 AM