Gold Prices have Dropped: బంగారం తగ్గుముఖం
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:19 AM
బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి రేటు 10గ్రాములకు రూ.4,690తగ్గిపోయింది.
ఒక్కరోజులోనే రూ.4,690 తగ్గిన ధర
హైదరాబాద్‌లో తులం రూ.1,25,890
న్యూఢిల్లీ, అక్టోబరు 22: బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి రేటు 10గ్రాములకు రూ.4,690తగ్గిపోయింది. 24క్యారట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.1,25,890గా ఉంది. మంగళవారం ఇది రూ.1,30,580గా ఉంది. అక్టోబరు 17న బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1,32,770కి చేరుకున్న సంగతి తెలిసిందే. దీనితో పోలిస్తే బంగారం రేటు బుధవారానికి రూ.6,880 తగ్గింది. ఇక, అంతర్జాతీయ విపణిలో ఔన్సు(31.10గ్రాముల) బంగారం రేటు 4,053డాలర్లకు పడిపోయింది. డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతోనే బంగారం ధర తగ్గుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, వెండి ధర బుధవారం ఇండియాలో కిలోకు రూ.1.60లక్షలుగా ఉంది.