Kishtwar encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు టెర్రరిస్టుల హతం
ABN , Publish Date - May 23 , 2025 | 05:07 AM
కిష్త్వార్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబలో 50మంది ఉగ్రవాదుల చొరబడే యత్నాన్ని బీఎస్ఎఫ్ ధీటుగా తిప్పికొట్టింది.
జమ్మూ, మే 22: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. సింగ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు పోలీసులతో కలిసి సంయుక్త కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టగా, ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహిస్తున్నప్పుడు జమ్మూకశ్మీరులోని సాంబ జిల్లా పరిధిలో సుమారు 45-50 మంది ఉగ్రవాదులు.. భారీగా చొరబడేందుకు ప్రయత్నించారని బీఎ్‌సఎఫ్ డీఐజీ ఎస్‌ఎస్ మాండ్ గురువారం వెల్లడించారు. భారత బలగాలు గుళ్ల వర్షం కురిపించడంతో వారు పాక్‌లోకే పారిపోయారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News