Food Safety Department: స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:22 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వీట్ తయారీ కేంద్రాలు, రిటైల్ షాపులపై ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వీట్ తయారీ కేంద్రాలు, రిటైల్ షాపులపై ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం 33 జిల్లాల్లోని 95 స్వీట్ యూనిట్లలో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో అధికారులు పలు ఆందోళనకర విషయాలను గుర్తించారు. పాలతో తయారుచేసే జిలేబీ, లడ్డూ, ఖోవా వంటి పదార్థాలలో ప్రమాదకరమైన సింథటిక్ రంగులు వాడుతున్నట్లు తేలింది. అంతేకాక, స్వీట్ల అలంకరణకు వినియోగించే వెండి పూత (సిల్వర్ ఫాయిల్) కూడా నాన్-ఫుడ్ గ్రేడ్ నాణ్యతతో ఉందని, ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని అధికారులు నిర్ధారించారు. చాలా తయారీ కేంద్రాల్లో కల్తీ నెయ్యితో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.