Share News

Moradabad Crime: ప్రిన్సిపాల్‌ గదిలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్

ABN , Publish Date - May 23 , 2025 | 05:03 AM

పన్నెండేళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలోని ప్రిన్సిపల్‌ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

Moradabad Crime: ప్రిన్సిపాల్‌ గదిలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్

యూపీలో ఘటన.. ఐదుగురు బాలుర అరెస్టు

బరెయిలీ, మే 22: పన్నెండేళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలోని ప్రిన్సిపల్‌ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. యూపీలోని మొరాదాబాద్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఐదుగురు నిందితులు 12-15 ఏళ్లలోపు వారే. బాలికతో పాటు అదే స్కూల్లో ఏడో క్లాసు నుంచి తొమ్మిదో క్లాసు చదువుతున్నారు. నిందితులంతా కూడా బాలిక ఇంటి సమీపంలోనివారే.. ఆమె సామాజిక వర్గానికి చెందిన పిల్లలే! మే 8న బాలిక, తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఆమెతో మాటలు కలిపిన ఐదుగురు బాలురు.. కొద్దిసేపటికి ఆమెను అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరి తండ్రి స్కూల్లో వాచ్‌మన్‌ కావడంతో బడి తాళం చెవులు తెచ్చాడు. బడి గేటు తాళం తీసి.. ఆమెను నేరుగా ప్రిన్సిపల్‌ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను బాలికతో తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి ఒడిగట్టారు. కొన్నిరోజులకు ఆ వీడియోను ఆ బాలురే నెట్‌లో పెట్టారు. ఈ నెల 19న బాలిక పొరుగింటి మహిళ ఆ వీడియోను చూసి.. దారుణం గురించి బాధితురాలి తల్లికి చెప్పింది. బాలిక తల్లి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట ప్రవేశపెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:04 AM