Indian Army: తేజ్‌సలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:41 AM
ఇద్దరూ కలిసి 45 నిమిషాల పాటు యుద్ధ విమానంలో గాల్లో విహరించారు. రెండు రక్షణ దళాల అధిపతులు యుద్ధవిమానంలో ఇలా కలిసి విహరించడం ఇదే తొలిసారి.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ఆదివారం తేజస్ ఎయిర్‌క్రా్‌ఫ్టలో ప్రయాణించారు. ఇద్దరూ కలిసి 45 నిమిషాల పాటు యుద్ధ విమానంలో గాల్లో విహరించారు. రెండు రక్షణ దళాల అధిపతులు యుద్ధవిమానంలో ఇలా కలిసి విహరించడం ఇదే తొలిసారి. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికైంది. తన జీవితంలో ఇదో అద్భుత ఘట్టమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఐదురోజుల పాటు ఏరో ఇండియా ప్రదర్శన జరగనుంది. ఇందులో భారత్‌తో పాటు అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలను ప్రదర్శించనున్నాయి.