First Woman Officer in PM: ఎస్పీజీలో తొలి మహిళా అధికారి అదాసో కపెసా
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:23 AM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల యూకే పర్యటనలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఓ
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల యూకే పర్యటనలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో వైరల్‌గా మారింది. అది ప్రధాని మోదీది కాదు ఆయన వెనుక అచంచలంగా నిలబడి ఉన్న ఓ మహిళా అధికారిది. ఆమె పేరు అదాసో కపెసా భారత ప్రధాని వ్యక్తిగత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ)లో చేరిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. 1885లో ఏర్పాటైన ఎస్పీజీలో ఓ మహిళా అధికారి విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మణిపుర్‌లోని సేనాపతి జిల్లా కైబీ గ్రామానికి చెందిన కపెసా ప్రస్తుతం ఎస్పీజీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎ్‌సబీ)లో చేరి 55వ బెటాలియన్‌లో ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌లో సేవలందించారు. ఓ మారుమూల గ్రామం నుంచి ఎస్పీజీలో అధికారిగా ఎదిగిన కపెసా ప్రయాణం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా తనలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.