Jharkhand AC Bus Fire: ఝార్ఖండ్‌లో ఏసీ బస్సులో మంటలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:25 AM
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రాంచీ నుంచి ఛాత్రా వెళ్తున్న ఏసీ బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.
45 మంది ప్రయాణికులు సురక్షితం
రాంచీ, అక్టోబరు 25: ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రాంచీ నుంచి ఛాత్రా వెళ్తున్న ఏసీ బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. బ్యాటరీ బాక్సు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ప్రారంభం కాగా, బస్సులో ఉన్న రసాయనాల కారణంగా అవి వెంటనే వ్యాపించాయి. దాంతో బస్సును నిలుపుదల చేసి అందులోని మొత్తం 45 మంది ప్రయాణికులను కిందికి దించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.