Share News

USAID: ఓటింగ్‌ శాతం పెంపునకు.. యూఎ్‌సఎయిడ్‌ నిధులివ్వలేదు

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:08 AM

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రాజెక్టులకు సహాయం చేసిందని ఓ నివేదికలో వెల్లడించింది.

USAID: ఓటింగ్‌ శాతం పెంపునకు.. యూఎ్‌సఎయిడ్‌ నిధులివ్వలేదు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌(యూఎ్‌సఎయిడ్‌) భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంపునకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రాజెక్టులకు సహాయం చేసిందని ఓ నివేదికలో వెల్లడించింది. వ్యవసాయం-ఆహారభద్రత కార్యక్రమాలు, తాగునీరు-పారిశుద్ధ్యం-పరిశుభ్రత(వాష్‌), పునరుత్పాదక ఇంధన శక్తి, విపత్తు నిర్వహణ-ఆరోగ్యం, సుస్థిర అడవులు-వాతావరణ కార్యక్రమాలు, ఆవిష్కరణలపై భారత్‌ రూ.6,498 కోట్ల(750 మిలియన్‌ డాలర్లు) అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులకు యూఎ్‌సఎయిడ్‌ నుంచి రూ.825 కోట్లు(97 మిలియన్‌ డాలర్లు) అందినట్లు ఆ నివేదిక స్పష్టంచేసింది. కాగా.. భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు యూఎ్‌సఎయిడ్‌ ద్వారా రూ.182 కోట్లు(21 మిలియన్‌ డాలర్లు) ఇచ్చినట్లు ట్రంప్‌ ఆరు రోజులుగా ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:08 AM