Mental Stress: పని ఒత్తిడిలో 52 శాతం ఉద్యోగులు
ABN , Publish Date - Mar 13 , 2025 | 06:21 AM
ఈ సంస్థ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న మొత్తం 1500 మందిపై సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది.

న్యూఢిల్లీ, మార్చి 12: కొవిడ్ తర్వాత ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక భారత్‌లోని దాదాపు 52ు మంది ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న వెర్టెక్స్ గ్రూప్ తాజా సర్వేలో వెల్లడించింది. ఈ సంస్థ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న మొత్తం 1500 మందిపై సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. 23 శాతంపైగా ఉద్యోగులు సాధారణ పని గంటలకు మించి పనిచేస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది.