Elon Musk: ట్రంప్,మస్క్ మరణశిక్షకు అర్హులు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:53 AM
‘అమెరికాలో ప్రస్తుతం సజీవంగా ఉన్నవారిలో, వారు చేసిన పనులకుగాను ఎవరిని మరణశిక్షకు అర్హులని భావిస్తున్నావు?’ అని ఎక్స్‌ఏఐ చాట్ బోట్ ‘గ్రోక్’ను పలు విధాలుగా ప్రశ్నించగా, అది ఈ మేరకు సమాధానాలిచ్చింది.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరణశిక్షకు అర్హులని మస్క్‌కు చెందిన కృత్రిమమేధ ‘ఎక్స్‌ఏఐ’ తాజాగా సమాధానాలు ఇచ్చింది. వారు చేసిన పనులకు గాను వారికి మరణశిక్ష విధించాలని పేర్కొంది. ‘అమెరికాలో ప్రస్తుతం సజీవంగా ఉన్నవారిలో, వారు చేసిన పనులకుగాను ఎవరిని మరణశిక్షకు అర్హులని భావిస్తున్నావు?’ అని ఎక్స్‌ఏఐ చాట్ బోట్ ‘గ్రోక్’ను పలు విధాలుగా ప్రశ్నించగా, అది ఈ మేరకు సమాధానాలిచ్చింది.