Share News

Election Commission: మేం ఒక్కరు కాదు.. ముగ్గురం: ఈసీ

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:02 AM

‘‘మేం ఒక్కరు కాదు.. ముగ్గరం’’ అని పేర్కొంది. ఆప్‌ నేతలు చేసిన ఆరోపణలు ఉద్దేశ పూర్వకమని, ఈసీపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయని తెలిపింది. ఈసీ అంటే ఒక్క అధికారి చేతుల్లోనే ఉందన్న ఉద్దేశాన్ని కల్పించేలా ఆప్‌ నేతల ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.

Election Commission: మేం ఒక్కరు కాదు.. ముగ్గురం: ఈసీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ నడుపుతున్నారంటూ ఆప్‌ నాయకులు ఎన్నికల ప్రచారం చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘మేం ఒక్కరు కాదు.. ముగ్గరం’’ అని పేర్కొంది. ఆప్‌ నేతలు చేసిన ఆరోపణలు ఉద్దేశ పూర్వకమని, ఈసీపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయని తెలిపింది. ఈసీ అంటే ఒక్క అధికారి చేతుల్లోనే ఉందన్న ఉద్దేశాన్ని కల్పించేలా ఆప్‌ నేతల ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. అయితే, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కావడంతో సంయమనం పాటించాలని నిర్ణయించుకున్నట్టు వివరించింది.

Updated Date - Feb 05 , 2025 | 05:02 AM