Share News

Anil Ambani: అనిల్‌ అంబానీకి మళ్లీ ఈడీ పిలుపు

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:01 AM

బ్యాంకు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ.....

 Anil Ambani: అనిల్‌ అంబానీకి మళ్లీ ఈడీ పిలుపు

న్యూఢిల్లీ, నవంబరు 6: బ్యాంకు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (66)కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ గత ఆగస్టులో అనిల్‌ అంబానీని దాదాపు పది గంటల పాటు విచారించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన 2,929 కోట్ల రుణాన్ని అక్రమంగా దారి మళ్లించిన కేసులో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)పై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో నవంబరు 14న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆయనను కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - Nov 07 , 2025 | 05:01 AM