Share News

Suresh Raina and Shikhar Dhawan: సురేశ్‌ రైనా, ధవన్‌ల ఆస్తులు జప్తు

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:21 AM

అక్రమ బెట్టింగ్‌ సైట్‌ కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌....

Suresh Raina and Shikhar Dhawan: సురేశ్‌ రైనా, ధవన్‌ల ఆస్తులు జప్తు

  • ఇద్దరి ఆస్తుల విలువ రూ.11.14 కోట్లు

  • రైనా మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.6.64 కోట్లు

  • శిఖర్‌ ధవన్‌ స్థిరాస్తులు రూ.4.50 కోట్లు

  • అక్రమ బెట్టింగ్‌ సైట్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ చర్య

  • అక్రమ బెట్టింగ్‌ సైట్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ చర్య

న్యూఢిల్లీ, నవంబరు 6: అక్రమ బెట్టింగ్‌ సైట్‌ కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. 1్ఠ బ్యాట్‌ సైట్‌, ఇతర అక్రమ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో రైనాకు చెందిన మ్యుచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు రూ.6.64 కోట్లను, ధవన్‌కు చెందిన రూ.4.5 కోట్ల స్థిరాస్థులను ఈడీ సీజ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి రైనా, ధవన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్‌ కుంభకోణంలో రూ.1000కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ‘‘అన్నీ తెలిసీ’’ 1్ఠ బ్యాట్‌ బెట్టింగ్‌ సైట్‌, దాని సరోగేట్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసేందుకు విదేశీ సంస్థలతో రైనా, ధవన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ మేరకు ఇద్దరికీ విదేశాల నుంచి అక్రమపద్ధతిలో చెల్లింపు లు జరిగాయని ఈడీ పేర్కొంది. సదరు విదేశీ సంస్థలు భారత్‌లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 1్ఠ బ్యాట్‌, 1్ఠ బ్యాట్‌ స్పోర్టింగ్‌ లైన్స్‌ తదితర సైట్లను నిర్వహిస్తున్నారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది. భారత్‌లోని దాదాపు 6వేల మ్యూల్‌ అకౌంట్ల ద్వారా 1్ఠ బ్యాట్‌ సైట్‌ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా మరో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఉతప్ప, నటుడు సోనూసూద్‌, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగా ల్‌ నటుడు అంకుశ్‌ హజ్రాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది.

Updated Date - Nov 07 , 2025 | 05:21 AM