Share News

ED Accuses Robert Vadra: రాబర్ట్‌ వాద్రాది నేరపూరిత ఆర్జన

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:21 AM

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రా ఓ భూమి అమ్మకం వ్యవహారంలో

ED Accuses Robert Vadra: రాబర్ట్‌ వాద్రాది నేరపూరిత ఆర్జన

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రా ఓ భూమి అమ్మకం వ్యవహారంలో రూ.58 కోట్లు ఆర్జించారని ఈడీ ఆరోపించింది. ఇది నేరపూరిత ఆర్జన అని పేర్కొంది. ఈ మేరకు గతనెలలో కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. రాబర్ట్‌ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రాంలోని షికోపూర్‌లో ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. దానిని డీఎల్‌ఎఫ్‌ కంపెనీకి రూ. 58 కోట్లకు విక్రయించింది. ఇది నగదు అక్రమ చలామణి కిందకు వస్తుందని ఆరోపిస్తూ ఈడీ కేసు నమోదు చేసింది. లంచంలో భాగంగానే డీఎల్‌ఎఫ్‌ కంపెనీకి అంత అధిక ధరకు భూమిని విక్రయుంచారని ఆరోపించింది.

Updated Date - Aug 11 , 2025 | 03:21 AM