Share News

FATF Report: ఈ కామర్స్‌తో ఉగ్ర భూతానికి ఆర్థిక ఊతం

ABN , Publish Date - Jul 09 , 2025 | 03:07 AM

ఈ కామర్స్‌ ప్లాట్‌పామ్‌లు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలను ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని..

FATF Report: ఈ కామర్స్‌తో ఉగ్ర భూతానికి ఆర్థిక ఊతం

న్యూఢిల్లీ, జూలై 8: ఈ కామర్స్‌ ప్లాట్‌పామ్‌లు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలను ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని.. వాటిని తమ ఆర్థిక లావాదేవీలకు (టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు), దాడులకు అవసరమైన పరికరాలు, రసాయనాలు, త్రీడీ ముద్రిత వస్తువుల కొనుగోలుకు ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘కాంప్రహెన్సివ్‌ అప్‌డేట్‌ ఆన్‌ టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌’ పేరిట ఇచ్చిన నివేదికలో ఆ సంస్థ.. మనదేశంలో జరిగిన రెండు ఉగ్ర దాడుల గురించి ప్రస్తావించింది. వాటిలో ఒకటి.. 2019లో పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ఉగ్రదాడి. మరొకటి.. 2022లో అహ్మద్‌ ముర్తజా అబ్బాసీ అనే ఉగ్రవాది గోరఖ్‌నాథ్‌ ఆలయంలోకి చొరబడడానికి ప్రయత్నించి, అడ్డుకున్న ఇద్దరు జవాన్లను గాయపరచిన ఘటన. పుల్వామా దాడికి ఉపయోగించిన ‘ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఈడీ)’ తయారీకి కావాల్సిన అల్యూమినియం పౌడర్‌ను ఈపామ్‌ అమెజాన్‌ నుంచి కొనుగోలు చేసినట్టు ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది.

Updated Date - Jul 09 , 2025 | 03:08 AM