Share News

Voter List Revision: ఎస్‌ఐఆర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Aug 27 , 2025 | 02:31 AM

బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది..

Voter List Revision: ఎస్‌ఐఆర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

  • ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన, విపక్షాల ఆరోపణలకు బదులు చెప్పేందుకు ఈసీ కసరత్తు

  • ఐదు ప్రశ్నలతో ప్రజల ముందుకు ఈసీ

న్యూఢిల్లీ, పట్నా, ఆగస్టు26: బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సర్‌పై బిహార్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఈసీ సిద్ధమైనట్టు సమాచారం. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా సర్‌పై ప్రజలకు అవగాహనం కల్పించడంతోపాటు ఓట్‌ చోరీ అంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు బదు లు చెప్పవచ్చునని ఈసీ ఆలోచనగా తెలిసింది. అలాగే, సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని ఈసీ అనుకుంటోంది. ఈ మేరకు సర్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు ఈసీ ఐదు ప్రశ్నలను సిద్ధం చేసినట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 02:31 AM