Share News

Election Commission: ఎన్నికల ఫుటేజీలను 45 రోజుల తర్వాత తొలగించండి: ఈసీ

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:11 AM

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజీల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission: ఎన్నికల ఫుటేజీలను 45 రోజుల తర్వాత తొలగించండి: ఈసీ

న్యూఢిల్లీ, జూన్‌ 20 : ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజీల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఫొటోలు, వీడియో ఫుటేజీలను ఎన్నికల ఫలితం వెలువడిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఫుటేజీలను తొలగించాలని స్పష్టం చేసింది.


ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు మే 30న లేఖలు పంపగా.. ఈ విషయం ఆలస్యంగా బయటికొచ్చింది. నిజానికి, ఎన్నికల చట్టాల ప్రకారం.. ఎన్నికల సరళి రికార్డింగ్‌ తప్పనిసరి కాదు. కానీ, పారదర్శకత కోసం ఓటింగ్‌ ప్రక్రియను ఈసీ రికార్డు చేయిస్తోంది. అయితే, ఆయా వీడియోలు, ఫొటోలను కొందరు సోషల్‌ మీడియాలో దుర్వినియోగం చేస్తుండడాన్ని ఈసీ గుర్తించింది.

Updated Date - Jun 21 , 2025 | 06:11 AM