Earthquake: ఢిల్లీలో భూకంపం ఆ సమయంలో ‘బూమ్’ అని భారీ శబ్దం
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:26 AM
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ధౌలా కౌన్ ప్రాంతంలోని జీల్ పార్కు కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5.36గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ధౌలా కౌన్ ప్రాంతంలోని జీల్ పార్కు కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉన్న కారణంగా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో, ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ఈ స్థాయిలో బలమైన ప్రకంపనలు ఇంతకుముందు రాలేదని స్థానికులు తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు బాంబు పేలినట్లు ‘బూమ్’ అని భారీ శబ్దం వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.