US Consulate: బెంగళూరులో యూఎస్ కాన్సులేట్
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:52 AM
బెంగళూరులో యూఎస్ కాన్సులేట్‌ను(వీసా అనుమతి కేంద్రం) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ శుక్రవా రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..దేశంలో యూఎస్ కాన్సులేట్‌ల సంఖ్య 12కు పెరిగిందన్నారు.

బెంగళూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో యూఎస్ కాన్సులేట్‌ను(వీసా అనుమతి కేంద్రం) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ శుక్రవా రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..దేశంలో యూఎస్ కాన్సులేట్‌ల సంఖ్య 12కు పెరిగిందన్నారు. బెంగళూరులో కాన్సులేట్ ఏర్పాటుతో అమెరికాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని, అంతరిక్ష పరిశోధనలకు అనుకూలం కానుందని, దేశ రక్షణ సంబంధిత వ్యవహారాలు, వాణిజ్యరంగాల్లో సంబంధాలు చేరువ అవుతాయన్నారు.