Indigo flight: ఇండిగో పైలట్ అభర్థనను తిరస్కరించిన పాక్
ABN , Publish Date - May 23 , 2025 | 05:11 AM
ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణ కారణంగా శ్రీనగర్‌లో అత్యవసర ల్యాండింగ్ నిర్వహించాల్సి వచ్చింది. పాక్ గగనతలంలోకి మారాలని పైలట్ చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది.

న్యూఢిల్లీ, మే 22: ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీనగర్‌లో ఎమర్జెన్సీగా ల్యాండయిన ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్రమైన తుఫానును ఎదుర్కొంది. దానిని నివారించేందుకు విమానాన్ని పాక్ గగనతలంలోకి మళ్లీంచేందుకు పైలట్ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని అనుమతి కోరాడు. అయితే పాక్ ఏటీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. ఆ విమానంలో తృనముల్ కాంగ్రె్‌సకు చెందిన ఎంపీలు సహా మొత్తం 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గాల్లో తుఫాను కారణంగా పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News