Delhi High Court: బ్యాంకు తనఖా హక్కులకు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:02 AM
బ్యాంకులు చట్టబద్దంగా తనఖా పెట్టుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని....
అట్రాసిటీ చట్టం నిబంధనలు అడ్డు కాదు
న్యూఢిల్లీ, అక్టోబరు 22 : బ్యాంకులు చట్టబద్దంగా తనఖా పెట్టుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని ఎస్సీ, ఎస్టీల ఆస్తులు, భూముల రక్షణ నిబంధనలు అడ్డుకోవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సన్‌దేవ్ అప్లయెన్సెస్ లిమిటెడ్ అనే సంస్థకు 2013లో యాక్సిస్ బ్యాంకు రూ.16.69 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందుకు మహారాష్ట్ర వాసాయిలోని స్థిరాస్తులను తనఖా పెట్టారు. అయితే ఆ రుణాన్ని చెల్లించడంలో విఫలమవడంతో 2017లో బ్యాంకు.. తనఖా పెట్టిన ఆస్తుల స్వాధీనానికి ఉపక్రమించింది. ఇది సివిల్ వివాదానికి దారితీసింది. ఈ వివాదంలో ఉన్న ఒక వ్యక్తి జాతీయ షెడ్యూలు తెగల కమిషన్‌ను ఆశ్రయించగా కమిషన్ యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవోలు తన ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో యాక్సిస్ బ్యాంకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు జాతీయ షెడ్యూలు తెగల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చి, కమిషన్‌కు ఈ అంశంపై విచారణ పరిధి లేదని స్పష్టం చేసింది.