Share News

Delhi CM: ఓట్ల కోసం నా తండ్రిని దూషిస్తారా?

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:31 AM

ఢిల్లీ సీఎం ఆతిశీ మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు.

Delhi CM: ఓట్ల కోసం నా తండ్రిని దూషిస్తారా?

బిధూరీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కన్నీరు

న్యూఢిల్లీ, జనవరి 6: ఢిల్లీ సీఎం ఆతిశీ మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. కల్కాజీ అసెంబ్లీ స్థానంలో తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్‌ బిధూరీ వృద్ధుడైన తన తండ్రిని నిందించారని కన్నీరు పెట్టుకున్నారు. ఓట్ల కోసం ఓ వృద్ధుడిని టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఆతిశీ తన తండ్రినే మార్చేశారని.. ఇదివరకు తన ఇంటిపేరు మర్లేనా అని చెప్పారని.. ఇప్పుడు సింగ్‌ అంటున్నారని బిధూరి ఆదివారం ఓ సభలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆతిశీ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉబికివచ్చే కన్నీటిని ఆపుకోవడానికి విఫలయత్నం చేస్తూ.. ‘నా తండ్రి తన జీవితమంతా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎవరి సాయమూ లేకుంటే నడిచే పరిస్థితుల్లో లేరు. ఎన్నికల కోసం అలాంటి వృద్ధుడిని నిందించే స్థాయికి బిధూరి దిగజారారు’ అని అన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 04:31 AM