Share News

Delhi blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో కీలక ఆధారం.. ఫోర్డ్ రెడ్ ఎకోస్పోర్ట్ SUV గుర్తింపు

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:53 PM

ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన భయంకర బ్లాస్ట్‌ కారకుల్ని గుర్తించేందుకు పోలీసులు దేశాన్ని జల్లెడపడుతున్నారు. విస్పోటన కారకుల గురించి దర్యాప్తు సంస్థలు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు.

Delhi blast:  ఢిల్లీ బ్లాస్ట్‌లో కీలక ఆధారం.. ఫోర్డ్  రెడ్ ఎకోస్పోర్ట్ SUV గుర్తింపు
Delhi blast

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన భయంకర బ్లాస్ట్‌ కారకుల్ని గుర్తించేందుకు పోలీసులు దేశాన్ని జల్లెడపడుతున్నారు. విస్పోటన కారకుల గురించి దర్యాప్తు సంస్థలు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు. నిందితులకు మరో రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ SUV (నంబర్ ప్లేట్ DL10CK0458)కారు ఉందని తేల్చారు. ఇప్పుడు ఆ కారుని కనుగొన్నారు.


ఈ వాహనాన్ని హర్యానాలోని ఖండవాలి గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్ వద్ద వదిలి నిందితులు పారిపోయినట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, హర్యానాలోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేసేవాడు. ఈ SUV అతని పేరుపై నార్త్-ఈస్ట్ ఢిల్లీలో ఫేక్ అడ్రస్‌తో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 12 , 2025 | 08:02 PM