Share News

Election Results : నేడే ఢిల్లీ ఫలితాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:53 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నాలుగోసారి అధికారంలోకి రానుందా? కమలనాథులు 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్‌ కోసం

Election Results : నేడే ఢిల్లీ ఫలితాలు

50 దాకా స్థానాల్లో గెలుస్తాం: బీజేపీ

ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు తప్పుతాయి.. మళ్లీ మేమే: ఆప్‌

పోలైన ఓట్ల జాబితా అప్‌లోడ్‌కు ఈసీ తిరస్కరణ: కేజ్రీవాల్‌

‘ఆపరేషన్‌ లోటస్‌’ ఆరోపణలపై

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నాలుగోసారి అధికారంలోకి రానుందా? కమలనాథులు 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్‌ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈనెల 5వ తేదీన పోలింగ్‌ జరగ్గా 60.54ు ఓటింగ్‌ నమోదైంది. తమ పార్టీ దగ్గర దగ్గరగా 50 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి వస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పుతాయని, కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్‌ చెబుతోంది. మరోవైపు.. ప్రతి అసెంబ్లీ స్థానంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా పోలైన ఓట్ల జాబితాతో కూడిన ఫామ్‌ 17సీ డాటాను అఽధికారిక వెబ్‌సైట్లో పెట్టాలని తాము పదే పదే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పారదర్శకత కోసం ప్రతి బూత్‌లో పోలైన ఓట్ల వారీగా వివరాలను వెల్లడించేందుకు తమ పార్టీ తరఫున ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేశామని ఎక్స్‌లో వెల్లడించారు. ఇక.. బీజేపీ నేతలు తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేరాలని, ప్రలోభపెట్టారని ఇందుకు రూ.15 కోట్లు ఇవ్వజూపారని కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేశారు.

Updated Date - Feb 08 , 2025 | 05:53 AM