Share News

BJP leadership: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:09 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం.....

BJP leadership: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా   దీపక్‌రెడ్డి

  • పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం

  • పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదముద్ర!

  • ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు. ఆదివారం

మిగతా 3వ పేజీలో...

బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి?

జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై చర్చించారు. నియోజకవర్గంలో లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ నుంచి ఎవరిని పోటీపెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీచేసిన మాధవీలత అభ్యర్థిత్వం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులోనూ దీపక్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. ఏక్షణమైనా ప్రకటన చేయవచ్చని పార్టీవర్గాలు వెల్లడించాయి.

Updated Date - Oct 13 , 2025 | 04:09 AM