Share News

ATM Azharul Islam: మరణ శిక్ష నుంచి జమాత్‌ నాయకుడికి విముక్తి

ABN , Publish Date - May 28 , 2025 | 06:51 AM

1971 యుద్ధ నేరాల్లో మరణశిక్ష పడ్డ జమాత్‌ ఎ ఇస్లామీ నాయకుడు ఎ.టి.ఎం. అజహురల్‌ ఇస్లాం వృద్దునిగా బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు విముక్తి ఇచ్చింది. అతను చేసిన నేరాలపై అప్పీల్స్ ద్వారా శిక్షను రద్దు చేసింది.

ATM Azharul Islam: మరణ శిక్ష నుంచి జమాత్‌ నాయకుడికి విముక్తి

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు తీర్పు

ఢాకా, మే 27: యుద్ధ నేరాల్లో మరణశిక్ష పడ్డ జమాత్‌ ఎ ఇస్లామీ నాయకుడు ఎ.టి.ఎం. అజహురల్‌ ఇస్లాం (73)కు విముక్తి కలిగిస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించిన ఆయన 1971 యుద్ధం సందర్భంగా పలు నేరాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. యుద్ధ నేరాల కింద విచారణ జరిపిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆయనకు మరణశిక్ష విధించింది. దానిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా శిక్షను రద్దు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:51 AM