In a Growing Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.58 కోట్ల దోపిడీ
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:10 AM
డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసగాళ్లు ముంబైకి చెందిన...
ముంబై వ్యాపారవేత్త నుంచి దోచేసిన సైబర్ నేరగాళ్లు
ముంబై, అక్టోబరు 16: డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసగాళ్లు ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త (72) నుంచి ఏకంగా రూ.58 కోట్లు దోచేసిన ఘటన వెలుగు చూసింది. ఈడీ, సీబీఐ అధికారులమని చెప్పి వాట్సాప్ వీడియో కాల్స్ చేసిన ఆ మోసగాళ్లు.. మనీలాండరింగ్ కేసు విచారణ పేరుతో వ్యాపారవేత్త దంపతులిద్దరినీ బెదిరించారు. దీని నుంచి బయటపడటానికిగాను డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ వ్యాపారి ఆగస్టు నుంచి రెండు నెలల వ్యవధిలో మోసగాళ్లు చెప్పిన పలు బ్యాంకు ఖాతాలకు రూ.58.13 కోట్లు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత తాను మోసపోయినట్టుగా తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో అబ్దుల్ ఖుల్లి (47), అర్జున్ కద్వసార (55), అతని సోదరుడు జేఠారామ్ కద్వసార (35)లను పోలీసులు అరెస్ట్ చేశారు.