Share News

Cyber Crime: ఆరు నెలల్లో 1,500 కోట్లు స్వాహా

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:21 AM

ఆరు నెలల్లో రూ.1,500 కోట్లు హాంఫట్‌.. సైబర్‌ నేరగాళ్లు దేశంలోని ప్రధాన నగరాల్లో జనంపై పలు ఇన్వె్‌స్టమెంట్‌ స్కీమ్‌ల పేరిట పంజా విసిరి కాజేసిన మొత్తం ఇది...

Cyber Crime: ఆరు నెలల్లో 1,500 కోట్లు స్వాహా

  • పలు ఇన్వె్‌స్టమెంట్‌ స్కీమ్‌ల పేరిట సైబర్‌ మోసగాళ్ల వల

న్యూఢిల్లీ, అక్టోబరు 25 : ఆరు నెలల్లో రూ.1,500 కోట్లు హాంఫట్‌.. సైబర్‌ నేరగాళ్లు దేశంలోని ప్రధాన నగరాల్లో జనంపై పలు ఇన్వె్‌స్టమెంట్‌ స్కీమ్‌ల పేరిట పంజా విసిరి కాజేసిన మొత్తం ఇది.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్‌ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, బెంగళూరు, దేశ రాజధాని ప్రాంతాలలోనే ఈ సైబర్‌ మోసాల్లో అధికంగా దాదాపు 65 శాతం కేసులు నమోదవడం గమనార్హం. భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం బెంగళూరు నగరంలో అత్యధికంగా(26.38 శాతం) ఈ మోసాలు చోటు చేసుకున్నాయి. ఈ నేరాలను విశ్లేషించిన తర్వాత పనిచేసే వయస్సులోని 30-60ఏళ్ల వారినే సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని తేలింది. బాధితుల్లో 76ు మంది ఈ వయస్సు వారే. సంపాదించే వయస్సులో ఉన్న వీరి ఆర్థిక ఆకాంక్షలను ఉపయోగించుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 05:21 AM