Share News

Chhattisgarh Maoists: నంబాల ఎన్‌కౌంటర్‌ను ఖండించిన సీపీఎం

ABN , Publish Date - May 23 , 2025 | 05:16 AM

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం, అమానుష హత్యలను మానివలసిందిగా సీపీఎం ఆహ్వానించింది.

Chhattisgarh Maoists: నంబాల ఎన్‌కౌంటర్‌ను ఖండించిన సీపీఎం

న్యూఢిల్లీ, మే 22: ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. మావోయిస్టులు చర్చల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని సీపీఎం పాలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించకపోగా అమానుష హత్యాకాండకు పాల్పడడమే తమ విధానంగా మార్చుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి డెడ్‌లైన్‌ ప్రకటిస్తుండడం, చర్చల అవసరం లేదని ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రి చెబుతుండడం వారి ఫాసిస్టు మనస్తత్వానికి నిదర్శనమని, వారి తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. కేంద్రం వెంటనే చర్చల కోసం మావోయిస్టుల విజ్ఞప్తిని అంగీకరించాలని, వారిపై పారా మిలిటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:17 AM