Share News

New Democracy: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:20 AM

సీపీఐ ఎంఎల్‌ తో సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో..

New Democracy: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

రాంనగర్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): సీపీఐ(ఎంఎల్‌)తో సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యాయి. ఈ విలీనం భవిష్యత్‌లో విప్లవ సంస్థల మధ్య ఐక్యతను పెంచేందుకు బలమైన పునాది ఏర్పరుస్తుందని సీపీఐఎంఎల్‌న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని మార్క్సు భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ కేంద్ర కమిటీ సభ్యులు వేముల వెంకట్రామయ్య, జేవి చలపతిరావు, సాదినేని వెంకటేశ్వర్‌రావు, బీ.ప్రదీప్‌, రాష్ట్ర కార్యదర్శి కార్గవర్గ సభ్యులు కే.గోవర్దన్‌ విప్లవ పార్టీల విలీనం వివరాలు వెల్లడించారు. 1969లో ఏర్పడిన సీపీఐ (ఎంఎల్‌) ప్రభావంతో అనేక ప్రాంతాలలో పీడనలు తగ్గాయని.. రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు పనికి తగిన వేతనం, రైతు కూలీల భాగస్వామ్యం, మహిళా సమస్యలపై ఉద్యమించి అనేక విజయాలు సాధించామన్నారు

Updated Date - Aug 14 , 2025 | 05:20 AM