Modi Xi Jinping: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి భేష్
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:27 AM
ఎస్సీవో సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాల సంబంధాల మధ్య పురోగతిని వామపక్ష పార్టీలు స్వాగతించాయి.
మోదీ, జిన్‌పింగ్ చర్చలను స్వాగతించిన వామపక్షాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఎస్సీవో సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాల సంబంధాల మధ్య పురోగతిని వామపక్ష పార్టీలు స్వాగతించాయి. మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం సానుకూల ఫలితాన్ని ఇచ్చిందని సోమవారం సీపీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే పురాతన నాగరికత గల భారత్, చైనా ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని ఈ సమావేశం పునరుద్ఘాటిస్తోందని వ్యాఖ్యానించింది.
భారత్, చైనా సంబంధాల్లో పురోగతిని సీపీఎం స్వాగతించింది. ‘భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోంది. ఇది శుభ సూచకం’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు.