Convicts Spotted Using Phones: 18 మంది ఆడవాళ్లను చంపిన కేసులో శిక్ష.. జైల్లో రాజభోగాలు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:26 PM
18 మంది ఆడవాళ్లను అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టయిన ఉమేష్ రెడ్డి పరప్పన అగ్రహార జైల్లో బిందాస్ లైఫ్ గడుపుతున్నాడు. అతడికి అన్ని రకాల వసతులు కల్పించబడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అతడు ఓ సీరియల్ కిల్లర్. పేరు ఉమేష్ రెడ్డి. 1996 నుంచి 2002 వరకు 20 మంది ఆడవాళ్లపై అత్యాచారం చేశాడు. 18 మందిని అతి దారుణంగా చంపేశాడు. సీరియల్ కిల్లింగ్స్ కేసులో అరెస్టై ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. 18 మంది ఆడవాళ్లను క్రూరంగా చంపిన అతడు జైల్లో బిందాస్ లైఫ్ గడుపుతున్నాడు. ఇంట్లో ఉన్నట్లుగానే అతడికి అన్ని వసతులు కల్పించబడ్డాయి. టీవీ చూస్తూ ఫోన్‌లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఉమేష్ రెడ్డి జైల్లో ఆండ్రాయిడ్ మొబైల్‌తో పాటు కీప్యాడ్ మొబైల్ కూడా వాడుతూ ఉన్నాడు.
మరణ శిక్ష నుంచి తప్పించుకుని..
2006లో కర్ణాటక హైకోర్టు ఉమేష్ రెడ్డికి మరణ శిక్ష విధించింది. అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మరణ శిక్షను 30 ఏళ్ల జైలు శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉమేష్ రెడ్డి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉన్నాడన్న మాటే కానీ, అతడికి లోపల అన్ని వసతులు కల్పించబడ్డాయి. జైల్లో కూడా లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో అతడు ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు.
అతడి వెనకాల కలర్ టీవీలో పాట ప్లే అవుతూ ఉంది. మరో వీడియోలో ఉమేష్ రెడ్డి కీప్యాడ్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. కేవలం ఉమేష్ రెడ్డి మాత్రమే కాదు. హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తరుణ్ కూడా పరప్పన అగ్రహార జైల్లో బిందాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అతడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. వంట చేసుకుని తిన్నాడు. ఇక, ఈ వీడియోలు జైలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. వారు దర్యాప్తునకు ఆదేశించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కూడా ఈ వీడియోలపై స్పందించారు. దర్యాప్తు జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
రైలును ఢీకొన్న గద్ద.. లోకో పైలట్‌కు గాయాలు..
లాంతరు గుడ్డి వెలుతురులో నేరాలకు చెక్.. తొలి దశ భారీ పోలింగ్‌పై యోగి