Share News

B.K. Hariprasad: ఆర్‌ఎస్‌ఎస్‌... ఇండియన్‌ తాలిబన్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:06 AM

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత కర్ణాటక శాసనమండలి సభ్యుడు బీకే హరిప్రసాద్‌..

B.K. Hariprasad: ఆర్‌ఎస్‌ఎస్‌... ఇండియన్‌ తాలిబన్‌

  • సంఘ్‌ వల్ల దేశంలో శాంతికి విఘాతం

  • కాంగ్రెస్‌ నేత హరిప్రసాద్‌ విమర్శలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత కర్ణాటక శాసనమండలి సభ్యుడు బీకే హరిప్రసాద్‌.. సంఘ్‌ను ఇండియన్‌ తాలిబన్లుగా పేర్కొంటూ, ఈ సంస్థవల్ల దేశంలో శాంతికి విఘాతం కలుగుతోందని హరిప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జీవో ఆర్‌ఎ్‌సఎస్‌ అని, ఎందరో స్వయంసేవక్‌లు దేశ స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను త్యాగం చేశారని ప్రధాని మోదీ కొనియాడిన విషయం విధితమే. దీనిపై స్పందించిన హరిప్రసాద్‌... సంఘ్‌ ఏనాడైనా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నదా అని నిలదీశారు.


అసలు ఆర్‌ఎ్‌సఎస్‌ ఒక రిజిస్టర్డ్‌ సంస్థ కూడా కాదని, అయినా దానికి నిధులు ఎలా సమకూరుతున్నాయో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ నేత మండిపడ్డారు. దీనిపై బీజేపీ కూడా దీటుగా స్పందించింది. ఆర్‌ఎ్‌సఎ్‌సను గాంధీ, జయప్రకాశ్‌ నారాయణ్‌లే కొనియాడారని బీజేపీ అధికార ప్రతినిధి షెహనాజ్‌ పూనావాలా పేర్కొన్నారు. సాక్షాత్తూ కాంగ్రెస్‌ మాజీ అగ్రనేత ప్రణబ్‌ ముఖర్జి కూడా సంఘ్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రె్‌సదే తాలిబన్‌ మైండ్‌సెట్‌ అంటూ దుయ్యబట్టారు.

Updated Date - Aug 18 , 2025 | 04:06 AM