Contractor Kidnapped: కాంట్రాక్టర్, గుమస్తాను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:06 AM
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్, గుమాస్తాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ వారి అదుపులోనే ఉన్నాడు. మావోయిస్టుల అదుపులో ఉన్న కాంట్రాక్టర్‌ను విడిపించడానికి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాంట్రాక్టర్ కిడ్నాప్‌తో బీజాపూర్ జిల్లా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మావోయిస్టులు ఎందుకు వారిని కిడ్నాప్ చేశారన్నది తెలియరాలేదు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ కుటుంబసభ్యులు మావోయిస్టులు ఆయన్ని ఏం చేస్తారేమోనని భయపడుతున్నారు.
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
మావోయిస్టు పార్టీకి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య డివిజనల్ కమిటీ మెంబర్ మడివి గంగి అలియాస్ విమల అలియాస్ భీమేలు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గగనపల్లి పంచాయతీ బోడెగుబ్బల్ గ్రామానికి చెందిన విజ్జల్ 4 దశాబ్దాల క్రితం ఉద్యమబాట పట్టి వివిధ హోదాల్లో పనిచేశాడు. 1994లో పశ్చిమ బస్తర్ ప్రాంత దళ సభ్యుడిగా, జాతీయ పార్క్ ప్రాంతం ఏసీఎం, పీపీసీఎం, ఎల్‌వోఎస్ కమాండర్‌గా, కుంటా ప్రాంత సెక్షన్ కమాండర్‌గా, తెలంగాణ డీవీసీఎం, సీవైపీసీగా, ఏవోబీ, దక్షిణ, పశ్చిమ బస్తర్, మాడ్, గడ్చిరోలి ప్రాంతాల్లో ఆపరేషన్ చేశాడు.
ఇవి కూడా చదవండి
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..
కాంట్రాక్టర్, గుమస్తాను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు