Share News

MLA Satish Sails Residence Raided: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో కోటి నగదు.. కిలోల కొద్దీ బంగారం

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:04 AM

ఉత్తరకన్నడ జిల్లా కారవార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సతీశ్‌ శైల్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ...

MLA Satish Sails Residence Raided: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో కోటి నగదు.. కిలోల కొద్దీ బంగారం

  • సతీశ్‌ శైల్‌ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు

బెంగళూరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఉత్తరకన్నడ జిల్లా కారవార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సతీశ్‌ శైల్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నిర్వహించిన దాడిలో కళ్లు చెదిరేలా నగదు, బంగారం బయటపడింది. గతంలో ఐరన్‌ ఓర్‌ అక్రమ తరలింపు కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక ్జకోర్టు సతీశ్‌ శైల్‌కు ఏడేళ్ల జైలు, రూ.9 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆ శిక్షను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసుకు సంబంధించే తాజాగా దాడులు జరిగాయి. బుధ, గురువారాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం గుర్తించినట్టు ఈడీ ‘ఎక్స్‌’ ద్వారా శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ, గోవా, ముంబై, బెంగళూరు నుంచి ఈడీ అధికారులు దాడిలో పాల్గొన్నారు. 1.68 కోట్ల రూపాయల నగదు, 6.750 కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. 14.13 కోట్ల రూపాయలు ఉన్న బ్యాంకు ఖాతాను స్తంభింప చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు కార్యాలయాలపైనా దాడులు నిర్వహించారు.

Updated Date - Aug 16 , 2025 | 07:33 AM