Share News

Sajjan Kumar: సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్‌ కుమార్‌ దోషిగా ఖరారు

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:51 AM

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984 నవంబర్‌ ఒకటిన ఢిల్లీలోని సరస్వతి విహార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరి మూకలు మారణాయుధాలతో విరుచుకుపడ్డాయి.

Sajjan Kumar: సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్‌ కుమార్‌ దోషిగా ఖరారు

ఈ నెల 18న శిక్ష ఖరారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సిక్కు అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ను ఢిల్లీ న్యాయస్థానం దోషిగా ఖరారు చేసింది. ఈ నెల 18న ఆయనకు శిక్షను ఖరారు చేస్తామని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984 నవంబర్‌ ఒకటిన ఢిల్లీలోని సరస్వతి విహార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరి మూకలు మారణాయుధాలతో విరుచుకుపడ్డాయి. ఈ కేసులో 2021 డిసెంబర్‌ 16న సజ్జన్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో భాగంగా కోర్టు ఆయన్ను దోషిగా గుర్తించింది.

Updated Date - Feb 13 , 2025 | 05:51 AM