Share News

Tamil Nadu CM: యూజీసీ కొత్త రూల్స్‌ను రద్దు చేయండి: స్టాలిన్‌

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:01 AM

విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల నియామకంపై రాష్ట్ర గవర్నర్‌కే సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు.

Tamil Nadu CM: యూజీసీ కొత్త రూల్స్‌ను రద్దు చేయండి: స్టాలిన్‌

చెన్నై, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల నియామకంపై రాష్ట్ర గవర్నర్‌కే సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. తమిళనాట ఇప్పటివరకూ వైస్‌ఛాన్సలర్లను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్‌కమిటీ సిఫారసుల మేరకు, గవర్నర్‌ ఆమోదం పొందే పద్ధతి ఉండేదని పేర్కొన్నారు. యూజీసీ కొత్త నిబంధన ప్రకారం వీసీల నియామకం కోసం సెర్చ్‌కమిటీలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా గవర్నర్‌కే ఉంటుందని, రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఈ నిబంధనల్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఇదే విధమైన లేఖను ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము-కశ్మీర్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు కూడా పంపించారు.

Updated Date - Jan 21 , 2025 | 04:01 AM