CM Siddaramaiah Says: సీఎం కావాలంటే హైకమాండ్ ఆశీర్వాదం ఎమ్మెల్యేల మద్దతూ ఉండాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:19 AM
ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ హైకమాండ్ ఆశీర్వాదంతోపాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలని కర్ణాటక......
బెంగళూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ హైకమాండ్ ఆశీర్వాదంతోపాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. ‘నవంబరులో నాయకత్వ మార్పు, మంత్రివర్గ ప్రక్షాళన’ అంటూ వారం రోజులుగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బాగల్కోటె జిల్లా బండిగణిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యేల మద్దతు లేకుండా సీఎం కావడం సులభం కాదని పేర్కొన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ కార్యక్రమాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించరాదని మంత్రి ప్రియాంకఖర్గే తనకు లేఖ రాశారని, తమిళనాడులో ఎలా వ్యవహరించారో.. ఇక్కడా అలాగే వ్యవహరించాలని చీఫ్ సెక్రటరీకి సూచించానని తెలిపారు. బెంగళూరులో మంత్రులతో సోమవారం విందు ఏర్పాటు చేయడంపై...‘మరోసారి విందు ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించగా, కలిసి భోజనం చేయడం కూడా నేరమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.