Supreme Court: జస్టిస్ వర్మ పిటిషన్‌పై విచారణకు ధర్మాసనం
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:40 AM
నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ వర్మ పిటిషన్‌పై విచారణకు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు.
దాంట్లో నేను భాగస్వామిగా ఉండను
గతంలో ఈ అంశంపై ఏర్పాటైన విచారణ
కమిటీలో సభ్యుడిగా ఉన్నందునే.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 23: నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ వర్మ పిటిషన్‌పై విచారణకు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు. అయితే, ఆ బెంచ్‌లో తాను ఉండబోనని ప్రకటించారు. ఈ వ్యవహారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ఉన్నప్పుడు నిర్వహించిన విచారణ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నాను కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసే బెంచ్‌లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ వర్మ పిటిషన్‌పై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. పలు రాజ్యాంగపరమైన అంశాలను పిటిషన్‌లో లేవనెత్తామని తెలిపారు. దానికి సీజేఐ స్పందిస్తూ తన నిర్ణయాన్ని తెలిపారు.